Actress Vani Viswanath on Monday fired at YSR Congress Party chief YS Jaganmohan Reddy for his Padayatra. <br />వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తన ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు మండిపడ్డారు. <br />తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్న నటి వాణీ విశ్వనాథ్ కూడా జగన్ పాదయాత్రపై నిప్పులు చెరిగారు. జగన్ మైండ్ సెట్ మారలేదని, పాదయాత్ర తొలి రోజే వ్యక్తిగత దూషణకు దిగాడని, ఇక నుంచి డయల్ 1100ను ప్రతిపక్షంగా భావిద్దామని చంద్రబాబు అన్నారు. <br />పరిష్కార వేదిక డయల్ 1100నే ప్రతిపక్షంగా పరిగణించి, ఆ విభాగానికి ప్రజలు చేసే ఫిర్యాదులు, చెప్పే అభిప్రాయాలపైన అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని చంద్రబాబు చెప్పారు. ప్రతిపక్ష వైసిపి లేదని అసెంబ్లీ సమావేశాలను తేలిగ్గా తీసుకోవొద్దని, మరింత సజావుగా సభ జరగాలని, మంత్రులు ప్రతి ప్రశ్నకు, చర్చకు బాగా సన్నద్ధమై వచ్చి సమాధానామివ్వాలన్నారు.